ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడటం తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా కోరే ఆలోచనలో ఉన్నారు అనే విషయం అర్థమవుతుంది. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు కూడా వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ అధికారులతో కలిసి జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి.
రాష్ట్రంలో బడ్జెట్ రూపకల్పన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నారు. ఆర్థికశాఖ విషయంలో జగన్ చేసిన తప్పుల కారణంగా ఇప్పుడు బడ్జెట్ రూపకల్పన అనేది కాస్త ఇబ్బందికరంగా మారిందని రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం విషయంలో కూడా ప్రభుత్వానికి క్లారిటీ లేదు అని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు.
అయితే రాష్ట్రంలో ఆదాయం లేక ప్రభుత్వం ఇబ్బంది పడుతుందని అందుకే ఇప్పుడు ఆర్ధిక శాఖను గాడిలో పెట్టలేకపోయింది అని కొంతమంది అంటున్నారు. ఇక అప్పుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఇబ్బంది పడుతుందని దీనితో రెవెన్యూ లోటు కూడా భారీగా ఉంది అని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహాయం కోరడానికి ముఖ్యమంత్రి జగన్ సిద్ధమవుతున్నారని సమాచారం. అందుకే ఇప్పుడు అత్యవసరంగా ఆర్డినెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది అని కొంతమంది అంటున్నారు. మరి ఈ విషయంలో భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఏంటి అనేది చూడాలి.