వర్షాకాలంలో దోమల వల్ల కలిగే వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ నేడు పిలుపునిచ్చారు. దోమలు వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంపై విస్తృత ప్రచారం లో పాల్గొనాలని ఆయన కోరారు. ఇందుకుగాను ప్రతి ఆదివారం కనీసం ఓ పదిహేను నిమిషాలు అయినా ప్రజలు వారి సమయాన్ని కేటాయించి వారి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.
అంతేకాకుండా కరోనా వైరస్ తో పాటు డెంగ్యూ పట్ల కూడా మనమంతా చాలా అప్రమత్తంగా ఉండాలని, దీని కోసం ప్రతి ఆదివారం ఓ పదిహేను నిమిషాల పాటు మన ఇంటి పరిసరాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే వాటిని తీసేయాలని ఆయన సూచించారు. ఇందుకు ప్రజా భాగస్వామ్యం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాత్రి వ్యాప్తంగా 4276 కరోనా పాజిటివ్ బారిన పడగా 52 మంది మృత్యువాత పడ్డారు.