జాతీయ బాలల దినోత్సవం అత్యంత వైభవంగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో చేయని తప్పులకు పిల్లలు అనాథలుగా మారుతున్నారు. ఇలాంటి వారికి అందరితో సమానమైన అవకాశాాలు కల్పించాలని ప్రభుత్వం తపన పడుతోంది. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా బాలల హక్కులు చట్టాలు అమలు చేస్తూ వారి ఆరోగ్యం, భద్రతకు అనేక చర్యలు చేపడుతున్నారు. ఈరాష్ట్రంలో అన్ని వర్గాల పిల్లలకు తల్లి, తండ్రి, గురువు అన్నీ అంగన్వాడీలు అయి పనిచేస్తున్నాయన్నారు. కేసీఆర్ కిట్, ఆరోగ్య పరిక్షలు, పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్య తెలంగాణను సాధించకున్నామని సత్యవతి రాథోడ్ అన్నారు.
కళ్యాణ లక్ష్మీ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,00,116 అందిస్తుందని.. తద్వారా తెలంగాణలో బాల్యవివాహాలు గణనీయంగా తగ్గాయన్నారు. మనదగ్గర అమలు చేస్తున్న గ్రోత్ మానెటరింగ్ కు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాాయి. దేశం అంతా దీన్ని అమలు చేస్తామని కేంద్రం కూడా చెప్పిందని తెలిపారు సత్యవతి రాథోడ్.