చిల్లీ జుకిని గ్రిల్ టోస్ట్.. ఇలా చేసుకుని తింటే సూపర్ టేస్ట్..!

-

ఒక్కోసారి ఈవినింగ్స్ లో ఏదైనా తినాలనిపిస్తుంది. అప్పుడు ఇంట్లో ఉండేవి ఏవీ మన మైండ్ కు ఎక్కవు. అలాంటప్పుడు ఏదైనా వెరైటీగా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా..ఈ రోజుల్లో టోస్ట్ చేసినవి తినడానికి అందరూ ఇష్టపడుతున్నారు.. ఆ పద్దతిలోనే చిల్లీ జుకిని గ్రిల్ టోస్ట్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం ఇది ఎలా చేయాలో చూద్దామా..!

చిల్లీ జుకిని గ్రిల్ టోస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు

బ్రౌన్ బ్రెడ్ ఆరు
జుకిని తురుము ఒకటిన్నర కప్పు
పన్నీరు తురుము అరకప్పు
ఉడకపెట్టిన బంగాళదుంపల తురుము అరకప్పు
పుట్నాల పప్పు పొడి రెండు టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి ముక్కలు ఒక టేబుల్ స్పూన్
లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్
మీగడ ఒక టేబుల్ స్పూన్
మిరియాల పొడి ఒక టీ స్పూన్

తయారు చేసే విధానం..

మనం తీసుకున్న బ్రెడ్ ను రౌండ్ గా కట్ చేసుకోండి. ఏదైనా ప్లేట్ సాయంతో అలా కట్ చేసుకోవచ్చు. మిగిలిన ముక్కలను చిన్నగా కట్ చేసి పొడిగా చేసుకోండి. ఆ తర్వాత జుకిని వేజిటెబుల్ తురుము ఒక క్లాత్ లో వేసి నీళ్లు పోయాలా పిండుకోండి. ఆ తురుమును పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో ఈ వేసి పచ్చిదనం పోయే వరకూ వేంచండి. అందులోనే పచ్చిమిర్చి ముక్కలు, ఉడకపెట్టిన బంగాళ దుంపలతురుమ, పన్నీరు తురుము వేసి బాగా కలుపుకోండి.

లెమన్ జ్యూస్, మిరియాల పొడి వేసి బాగా కలిపి.. ఆ తర్వాత పుట్నాల పప్పు పొడి, ముందుగా గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ వేసి బాగా కలపండి. ముద్లలా అవుతుంది. అప్పుడు దించేసి.. ముందగా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ స్ కు వాటికి పాలు అద్దేసి దానపై ఈ జుకునీతో చేసుకున్న మిశ్రమాన్ని పెట్టండి. నాన్ స్టిక్ గ్రిల్ పైన మీగడ రాసేసి వాటిని కాల్చుకోండి. పైన మీగడ రాసి ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కాల్చుకోండి. అంతే గ్రిల్ టోస్ట్ రెడీ.. టమోటా సాస్ తో చేసుకుని తింటే రెడీ.. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లా, ఈవినింగ్ స్నాక్ లా చేసుకుని తినొచ్చు. ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే రోస్ట్ లు రెడీ..!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news