టెలిస్కోప్ సిగ్నల్స్ ద్వారా ఏలియన్స్ ను గుర్తించిన చైనా.. ఇంతలోనే!

-

చైనా ప్రభుత్వం ఓ భారీ రేడియో టెలిస్కోప్‌ను తయారు చేసింది. స్కై ఐ టెలిస్కోప్ ఉపయోగంతో కొత్త అప్‌డేట్ వచ్చింది. భూగోళం అవతల కూడా ఏలియన్స్ ఉన్నట్లు గుర్తించారు. చైనాకు చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ డైలీ ఈ విషయాన్ని ప్రపంచదేశాలకు వెల్లడించింది. మొదట్లో ఈ రిపోర్టును వెల్లడించగా.. తదనంతరం ఆ రిపోర్టులను డిలీట్ చేసింది. అయినా, ఈ వార్త వేగంగా విస్తరించడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఏలియన్స్
ఏలియన్స్

అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే చైనా.. భూగోళం అవతాల కూడా ఏలియన్స్ ఉన్నాయని వెల్లడించింది. అయితే ఈ వార్తలపై స్పందించిన చైనా.. స్కై ఐ అందించిన సిగ్నల్స్ ప్రకారం.. కొన్ని అనుమానాలు ఉన్నాయని, ఓ తరహా రేడియో తరంగాలు వచ్చాయని పేర్కొన్నారు. ఏలియన్స్ ఉన్నాయా? లేదా? అనే విషయంపై క్లారిటీ లేదన్నారు. దీనిపై మరింతగా పరిశోధన జరుగుతోందని జాంగ్ అనే శాస్త్రవేత్త వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఏలియన్స్ ఉన్నాయన్న వార్త చైనా మీడియాలో ట్రెండింగ్ అయింది. దీంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news