నేపాల్ కి షాకిచ్చిన చైనా..

-

చైనా ప్రదర్శించే స్నేహం అంతా కుటిలమేనని నేపాల్ కి తెలిసోచ్చే పరిస్థితులు వచ్చాయి. నేపాల్ భూభాగంలో యథేచ్ఛగా కట్టడాలు నిర్మిస్తుండటంతో చైనా అసలు నైజాన్ని ఇప్పుడు నేపాల్ గుర్తించింది. ఎలాగైనా ఉత్తర లడఖ్ ప్రాంతంలోని ప్రాంతాలను, అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలను చైనా అక్రమంగా ఆక్రమించుకోవాలని చూసింది. అయితే, చైనా ఎత్తుగడలను ఎప్పటికప్పుడు భారత సైన్యం తిప్పికొట్టడంతో చైనా ఇప్పుడు నేపాల్ భూ భాగాల మీద కన్నేసింది.

నేపాల్‌ లోని హుమ్లా జిల్లాలో చైనా 11 కట్టడాలను నిర్మించినట్టు గుర్తించారు. ఈ భూభాగం తనదేనని నేపాల్ చెబుతోంది. వివాదంలో ఉన్న భూ భాగంలో నమ్‌ఖా రూరల్ మునిసిపాలిటీ చైర్మన్ బిష్ణు బహదూర్ తమంగ్ పర్యటించారు. 2005లో కేవలం ఓ గుడిసె ఉన్న ప్రాంతంలో ఇప్పుడు 11 ఇళ్లు కనిపించడంతో అవాక్కయ్యారు. అయితే ఈ స్థలం తమదేనని చైనా వాదిస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం రాజుకుంది. కొద్ది సంవత్సరాల క్రితం నేపాల్ నిర్మించిన రోడ్డు వద్ద ఓ సరిహద్దు స్తంభం కనిపించడం లేదు. చైనా భద్రతా దళాలు, సరిహద్దులోని దళాలు ఇళ్లను నిర్మించిన విషయాన్ని నేపాల్ హోం మంత్రిత్వ శాఖకు మునిసిపాలిటీ చైర్మన్ బిష్ణు బహదూర్ తమంగ్ తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news