వ్యాక్సిన్ సమాచారాన్ని కొట్టేసేందుకు చైనా యత్నం.. అడ్డుకున్న భారత్.

-

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు కనిపెడతారా అని ఎన్ని రోజులు ఎదురుచూసామో మనందరికీ తెలుసు. కరోనా విజృంభిస్తున్నప్పుడు తొందరగా వ్యాక్సిన్ వచ్చేస్తే బాగుండని అందరూ కోరుకున్నారు. ఆ కోరికలన్నీ ఫలించి మన వైద్య శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ని కనిపెట్టారు. భారత్ నుండి కోవ్యాక్సిన్ తో కోవిషీల్డ్ వ్యాక్సిన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ వ్యాక్సిన్ల నాణ్యత కూడా బాగుందని, ప్రపంచ దేశాలన్నీ వీటి వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. దీంతో పొరుగు దేశమైన చైనాకి మండినట్లుంది.

అందుకే మన వ్యాక్సిన్ సమాచారాన్ని కొట్టేసేందుకు పూనుకుంది. ఇందులో భాగంగా భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ కంప్యూటర్లలోకి మాల్ వేర్ ను పంపే ప్రయత్నం చేసింది. హ్యాకింగ్ చేసి వ్యాక్సిన్ సమాచారాన్ని దొంగిలించి, తమ దగ్గర కూడా అలాంటి వ్యాక్సిన్ ని తయారు చేయాలని చూసింది. కానీ మాల్ వేర్ ప్రవేశాన్ని గుర్తించిన సాంకేతిక బృందం జాగ్రత్త పడింది. ఈ దెబ్బతో చైనా ఎలాంటిదో ఈజీగా అర్థం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news