తైవాన్‌పై దాడికి ప్లాన్‌..సరిహద్దుల్లో చైనా సైనిక విన్యాసాలు

-

చైనా తన ఆధిపత్య ధోరణిని కొనసాగిస్తునే ఉంది..ఒక వైపు ఇండో-చైనా సరిహద్దు వివాదాన్ని కొనసాగిస్తు మరో వైపు తైవాన్‌పై సైనిక దాడికి పాల్ప‌డేందుకు చైనా సిద్ధమవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లోకి భారీగా బలగాలను, ఆయుధాల‌ను త‌ర‌లించిన‌ట్లు స‌మాచారం. డీఎఫ్‌-11,డీఎఫ్‌-15 క్షిపణుల స్థానంలో అత్యాధునిక హైపర్‌సోనిక్‌ డీఎఫ్‌-17 క్షిపణుల‌ను మోహరించినట్లు రక్షణ రంగ నిపుణులు తెలిపారు. అలాగే ఫుజియాన్‌, గ్వాన్‌డాంగ్‌లోని రాకెట్‌ ఫోర్స్‌, మెరైన్‌ కార్ప్స్ స్థావరాల‌ను సైతం విస్తరించినట్లు కెనడా కేంద్రంగా పనిచేస్తున్న కన్వా డిఫెన్స్‌ రివ్యూ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా తెలుస్తోంది. ఇటీవల తైవాన్‌ సరిహద్దుల్లో చైనా సైనిక విన్యాసాల‌ను సైతం అధికం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news