కొసమెరుపు: బట్టలు ఊడదీస్తానన్న అయ్యన్నకు ఆడపడుచులు గుర్తొచ్చారు!

-

నోరు అదుపు – మాట పొదుపు అంటారు పెద్దలు! తుపాకీ నుండి తూటా కదిలినా.. నోటి నుండి మాట జారినా వెనక్కి తీసుకోలేమంటారు! ఈ విషయాలను ఏమాత్రం పట్టించుకోని, వంటపట్టించుకోని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మహిళా కమిషనర్ పై నోరు చేసుకున్న సంగతి తెలిసిందే. మహిళలపై అలాంటి చులకనభావం ఉన్న అయ్యన్నకు ఉన్నఫలంగా ఆడపడుచులు గుర్తుకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్!

విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్‌ తోట కృష్ణవేణిని అందరి ముందు… బట్టలు ఊడదీసే పరిస్థితి వస్తుందని.. ఆడ ఆఫీసర్ అయిపోయింది కానీ, లేదంటే ట్రీట్‌మెంట్‌ మరోలా ఉండేదని వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అయ్యన్నపై నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్‌ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం కేసు నమోదు చేసిన సంగతీ తెలిసిందే. మహిళలపై అలాంటి అభిప్రాయం కలిగి ఉన్న అయ్యన్న… తాజాగా ఆడపడుచులు, శ్రావణ శుక్రవారం వంటి మాటలు మాట్లాడారు!

అవును… పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దుబిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపిన అనంతరం తాజాగా స్పందించారు అయ్యన్న పాత్రుడు. మూడు రాజధానులకు ఆమోదం తెలుపి.. శ్రావణ శుక్రవారం రోజున ఆడపడుచులతో కన్నీళ్లు పెట్టించారని.. ఆ పాపం ఊరికే పోదని.. అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు!! దీంతో… ఒక మహిళా అధికారిణిని పట్టుకుని “బట్టలు ఊడదీస్తాను” అన్నస్థాయిలో మాట్లాడి, నిర్భయ కేసుల వరకూ వెళ్లిన అయ్యన్నకు ఉన్నపలంగా అమరావతి ఆడపడుచులు గుర్తుకురావడం గొప్పమార్పే అని తమ్ముళ్లు గుసగుసలాడుకోవడం ఈ సందర్భంగా కొసమెరుపు!

Read more RELATED
Recommended to you

Latest news