దేశంలో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప (77)కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు నిన్న రాత్రి ఆయన ట్వీట్ చేశారు. ‘నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. వైద్యుల సూచన మేరకు నేను ఆస్పత్రిలో చేరాను. కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ పరీక్షలు చేసుకోవాలని, సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని కోరుతున్నా’ అని ట్వీట్ చేశారు. కాగా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తర్వాత దేశంలో కరోనా బారిన పడ్డ రెండో సీఎం యడ్యూరప్ప.
ನನ್ನ ಕೊರೋನಾ ಪರೀಕ್ಷಾ ವರದಿಯಲ್ಲಿ ಪಾಸಿಟಿವ್ ಎಂದು ಬಂದಿದ್ದು, ರೋಗಲಕ್ಷಣಗಳು ಇಲ್ಲದಿದ್ದರೂ ಮುನ್ನೆಚ್ಚರಿಕೆ ದೃಷ್ಟಿಯಿಂದ, ವೈದ್ಯರ ಸಲಹೆಯಂತೆ ಆಸ್ಪತ್ರೆಗೆ ದಾಖಲಾಗುತ್ತಿದ್ದೇನೆ. ಕಳೆದ ಕೆಲವು ದಿನಗಳಲ್ಲಿ ನನ್ನ ಸಂಪರ್ಕಕ್ಕೆ ಬಂದಿರುವವರು, ಕ್ವಾರಂಟೈನ್ ನಲ್ಲಿದ್ದು ಮುಂಜಾಗ್ರತೆ ವಹಿಸಿ ಎಂದು ಕೋರುತ್ತೇನೆ.
— B.S. Yediyurappa (@BSYBJP) August 2, 2020
నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా లక్షణాలతో హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే. శనివారం కర్ణాటకలో వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటిల్‌తో పాటు ఆయన భార్య వైరస్ బారినపడ్డారు. అంతకు ముందు అటవీశాఖ, పర్యాటక శాఖ మంత్రులు ఆనంద్ సింగ్, సీటీ రవి కూడా కరోనా బారిన పడ్డారు.