ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి నేతలు అంతా ఒక్కొక్క పార్టీ గురించి ఒక్కమాదిరిగా చెబుతున్నారు. కాగా తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతామోహన్ వైసీపీ గురించి కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మాజీ కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న చింతామోహన్ మాట్లాడుతూ … ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కేవలం అధికారంలో ఉన్నామని చెప్పుకోవడానికి తప్పితే ఎందుకు పనికిరాదని విమర్శించారు. వైసీపీ పాలన ఏ విధంగానూ సరిగా లేదని, ఈ విషయం త్వరలోనే ప్రజలే చెబుతారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓటమి చెందుతుందని చెప్పారు, అంతే కాకుండా వైసీపీకి కేవలం 15 సీట్లు మాత్రమే వస్తాయని సంచలన ప్రొజెక్షన్ చెప్పారు. కాగా సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుక నియోజకవర్గంలో ఓడిపోతారని కామెంట్ చేశాడు. ఇక కేంద్రంలోనూ బీజేపీ అధికారాన్ని కోల్పోతుందని చింతామోహన్ చెప్పారు.
కాగా ఈయన చేసిన పొలిటికల్ కామెంట్స్ పై ఎవరైనా స్పందిస్తారా తెలియాల్సి ఉంది.