మెగాస్టార్ చిరంజీవి సినిమాల మీద ఇప్పుడు ప్రత్యేక ఆసక్తి ఉంది జనాలకు. ఆయన ఏ సినిమా చేస్తారో అని అందరూ కూడా ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర పై ముందు నుంచి కూడా ఆసక్తి ఉంది. ఆయన పాత్ర గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. దేవాదాయ శాఖ ఉద్యోగిగా ఆయన నటిస్తున్నారని అంటున్నారు.
ఇక ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చిరంజీవి ఈసినిమాలో రాజకీయ నాయకుడిగా నటిస్తున్నట్టు సమాచారం. ఆయన ఈ సినిమాలో మంత్రిగా నటిస్తారని అది దేవాదాయ శాఖా మంత్రిగా అని సమాచారం. దేవాలయాల మీద ఆసక్తి ఉండే ఒక ఉద్యోగి రాజకీయాల్లోకి వచ్చి దేవాలయాలను కాపాడతారని ఆ విధంగా ఈ సినిమాలో పాత్రను దర్శకుడు తీర్చి దిద్దారు అని అంటున్నారు.
చిరంజీవి ఇటీవల చేసిన వ్యాఖ్యల ఆధారంగా చూస్తే ఇందులో ఎక్కువగా రాజకీయ కోణం ఉంటుంది. ఒక కీలక నాయకుడు ఒక దేవాలయ సంపద మీద దృష్టి పెట్టడం దాన్ని ఒక ఉద్యోగి అడ్డుకోవడం ఈ విధంగా ఈ సినిమాను ముందుకి నడిపిస్తారని టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా 40 శాతం షూటింగ్ ని పూర్తి చేయగా మిగిలిన షూటింగ్ కరోనా తర్వాత పూర్తి అయ్యే అవకాశం ఉంది.