ఇప్పుడు నమోదు అవుతున్న కరోనా కేసుల ఆధారంగా చూస్తే… తెలంగాణా రాజధాని హైదరాబాద్ కి కరోనా కేసుల ప్రభావం ఎక్కువగా ఉంది. దాదాపు 40 శాతం కేసులు ఈ నగరంలోనే నమోదు అవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. కొంత మంది వార్నింగ్ లు మరీ భయపెడుతున్నాయి. మరో ముంబై గా హైదరాబాద్ మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
దీనితో అప్రమత్తమైన ప్రభుత్వం చాలా పక్కాగా చర్యలు తీసుకున్నారు. ప్రతీ గల్లీ లో కూడా భారీగా పోలీసులు మొహరించి అసలు ఎవరిని ఇల్లు దాటి బయటకు రానీయడం లేదు. కేసీఆర్ హైదరాబాద్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ వస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో ఉండే మంత్రులకు అసలు నియోజకవర్గాలు దాటి రావొద్దు అని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యేలకు కూడా ఇదే సూచన చేసారు.
ఇప్పుడు ఇక్కడ పురుషులకు ఎక్కువగా కరోనా వస్తుంది. దీనితో అసలు వ్రుద్దులను చిన్న పిల్లలను బయటకు రావొద్దని ఏదైనా అవసరం ఉంటే మహిళలే వచ్చి సరుకులను తీసుకుని వెళ్ళాలి అని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం నగరాల్లో ఎక్కువగా ఉంది. అందులో హైదరబాద్ కూడా ఒకటి. ఎలా లేదు అనుకున్నా కోటి మంది ప్రజలు ఉన్నారు. దీనితో పక్కా చర్యలు అనేది అవసరం.