చిరంజీవి – జగన్ ల మీద బ్రేకింగ్ న్యూస్ అవుతున్న వార్త ఇదే

-

 

అప్పుడు చిరంజీవి సైరా సినిమా రిలీజ్ అయిన సమయంలో జగన్ ను స్వయంగా కలిసి అతనికి తన సినిమాను చూపించాడు. ఆ తర్వాత జగన్ చిరంజీవికి రాజ్యసభ స్థానం కూడా ఆఫర్ చేశాడు అని అన్నారు. కానీ నిదానంగా వారిద్దరి మధ్య రాజకీయ పరంగా ఎటువంటి కనెక్షన్ లేదు అనుకుంటున్న సమయంలో చిరు.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించాడు.

 

దీనిపై మెగా అభిమానులు కూడా అప్పట్లో తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కూడా చిరంజీవి ఎలాంటి అవసరం లేకుండా దీనిపై ఎందుకు స్పందించాడు అని వారి కోపం. అయితే కొత్తగా తెరమీదకు వచ్చిన అంశం ఏమిటంటే మూడు రాజధానిలో విషయంపై చిరంజీవి ని బెదిరించి మాట్లాడించారని అమరావతి లోని జేఏసీ లో ఉన్న ప్రొఫెసర్ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. అతను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ వ్యాఖ్యలు చెయ్యడం గమనార్హం.

పైగా ఈరోజు పేపర్ లో సాక్షి ఈ విషయాన్నీ ప్రముఖంగా ప్రస్తావించింది. చిరంజీవి అభిమానుల పేరుతో మెగా స్టార్ ను వెనకేసుకొచ్చింది. “చిరంజీవిని బెదిరించి మాట్లాడించారన్న శ్రీనివాస్‌పై చిరంజీవి అభిమానులు మండిపడుతున్నారు. చిరంజీవికి వ్యక్తిగతంగా ఓ అభిప్రాయం ఉండదా అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. కులాల మధ్య చిచ్చురేపే ప్లాన్‌ లేకుండా ఇలా మాట్లాడి ఉండరంటున్నారు,” అంటూ సాక్షి ప్రచురించడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news