మా అసోసియేషన్ వేదికగా మరోసారి చిరంజీవి,రాజశేఖర్ మధ్య ఉన్న విభేదాలు మరోసారి గుప్పుమన్నాయి. తాజాగా 2020 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఈ భేధాభిప్రాయాలకు వేదిక అయింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, జయసుధ, మోహన్ బాబు, రాజశేఖర్, పరుచూరి వెంకటేశ్వరరావు, టీ సుబ్బరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన చిరంజీవి, సినిమా అసోసియేషన్ ఓ కన్ స్ట్రక్టివ్ గా సాగిపోవాలని, ఏదైనా మంచి జరిగితే, పెద్దగా అరిచి చెప్పాలని, గొడవలు వస్తే, చెవిలో చెప్పుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇలా మాట్లాడుతుండగా.. రాజశేఖర్ అడుగడున అడ్డుపడ్డారు. అంతేకాదు ఆయన నుంచి మైకు లాక్కొన్నాడు.
దీంతో అక్కడకున్న మిగతా సభ్యులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘మా’ డైరీ ఆవిష్కరణలో ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. చిరంజీవి ’మా’ లో ఒక మెంబర్ మాత్రమే. ఆయనకు అంతలా ప్రాధాన్యత ఇవ్వడం బాగోలేదన్నాడు. అందుకే ఇలా చేసాను అంటూ చెబుతూ వేదిక నుంచి దిగి వెళ్లిపోయారు. అంతకు ముందు వేదికపై ఉన్న చిరంజీవి సహా పెద్దలకు కాళ్లు మొక్కారు. మొత్తానికి 2020 మా డైరీ ఆవిష్కరణ మా అసోషియేషన్‌లో ఉన్న లొసుగులను బయటపెట్టింది. మరోవైపు మోహన్ బాబు, కృష్ణంరాజు చిరంజీవికి సపోర్ట్ నిలుస్తూ రాజశేఖర్ చేసిన పనిని తప్పుపట్టారు.