కరోనాపై ‘చిరు’ సందేశం వైరల్

-

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వృథా అవుతోంది. ప్రతీ రోజు కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా బారిన పడిన వారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, సెలెబ్రిటీలు కూడా తమ వంతు బాధ్యతకు కరోనాపై అవగాహన కలిగించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కరోనాపై ఉన్న భ్రమలు, భయాలు తొలగించేందుకు వీడియో సందేశాన్ని వదిలాడు.

ఆ వీడియోలో ఏముందంటే..‘మనకి ఏదో అయిపోతుందన్న భయం కానీ, ఏమీ కాదన్న నిర్లక్ష్యం కానీ పనికిరాదు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయమిది. జన సమూహానికి వీలైనంత దూరంగా ఉండండి. ఈ ఉద్ధృతి తగ్గేవరకు ఇంటి వద్దే ఉండడం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మోచేతుల వరకు వీలైనన్నీ సార్లు సుమారు 20 సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలి.

తుమ్మినా, దగ్గినా కర్చిఫ్ లాంటివి అడ్డు పెట్టుకోవడం లేక టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూపేపర్‌ కూడా చెత్త బుట్టలో వేయండి. జ్వరం, జలుబు, దగ్గు, అలసట ఉంటే డాక్టర్ ను సంప్రదించండి. కరోనా మహమ్మారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. ఎవరికీ కరచాలనం చేయకుండా మన సంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం.. అదే ఉత్తమం’ అని వీడియోలో తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news