వార్నీ అందుకే మహేష్ కు చిరు స్కెచ్ గీసాడా…?

-

గతంలో హీరోలు ఎలా ఉండే వారో తెలీదు గాని ఇప్పుడు మాత్రం ఒకరితో మరొకరు స్నేహగీతాలు పాడుతూ, ఇగోలు పక్కన పెట్టేసి పొగిడే కార్యక్రమాలు చేస్తూ అభిమానులను అన్ని విధాలుగా అలరిస్తున్నారు. గతంలో ఒక హీరో ఇంకో హీరో కార్యక్రమానికి హాజరు కావడం అనేది చాలా తక్కువ. దీనితో అభిమానులు కూడా ఇతర హీరల అభిమానులకు దూరంగా ఉండే వారు. ఒక హీరో సినిమా విడుదల అవుతుంది అంటే మరో హీరో అభిమానులు,

చూడకపోవడమే కాకుండా ఫ్లాప్ అవ్వాలని కోరుకునే వారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలు స్నేహం చేయడం మొదలు పెట్టారు. తాజాగా చిరంజీవి , మహేష్ బాబు సినిమా కార్యక్రమానికి హాజరయ్యారు. దీనితో సూపర్, మెగా అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి భారీగా హాజరయ్యారు. హైదరాబాద్ లో చిరంజీవి, మహేష్ సినిమాకు హాజరు కావడం ఇదే మొదటి సారి. గతంలో ఒక్కడు సినిమాకు దుబాయ్ లో హాజరయ్యారు.

అయితే మహేష్ తో చిరంజీవి స్నేహం చేయడానికి ప్రధాన కారణం రామ్ చరణ్ తో కలిసి సినిమా చేయడానికే అంటున్నారు. మల్టీ స్టారర్ లేదా రామ్ చరణ్ నిర్మాతగా మహేష్ తో సినిమా చెయ్యాలని చూస్తున్నారు. కొంత కాలంగా మహేష్ మార్కెట్ భారీగా పెరిగింది. దీనితో మహేష్ తో ఇప్పటి నుంచే స్నేహం చేస్తే రాజమౌళీ తర్వాత సినిమా చెయ్యొచ్చని భావిస్తున్నారట. అందుకే ముందు అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకోవడానికే చిరు హాజరయ్యారట. మహేష్ సినిమా వసూళ్ళూ కూడా పెరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version