చిత్రం 1.1 వెర్షన్లో అందరూ కొత్తవాళ్ళే.. ఏకంగా 45మంది..

Join Our Community
follow manalokam on social media

నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన దర్శకుడు తేజ, ఆ తర్వాత సీత సినిమాతో మళ్ళీ చతికిల పడ్డాడు. అప్పటి నుండి తేజ సినిమాల గురించి రకరకాల వార్తలు వచ్చాయి. కానీ అవేమీ అధికారికంగా ప్రకటించబడలేదు. తాజాగా తేజ తన మొదటి చిత్రానికి సీక్వెల్ తో వస్తున్నాడు. అసలు చిత్రం సినిమాకి సీక్వెల్ వస్తుందని వార్తలు రాని టైమ్ లో ఈ ప్రకటన రావడం కొంత షాకింగే. చిత్రం 1.1 పేరుతో వస్తున్న ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్ళే ఉంటారని సమాచారం అందుతోంది.

మొత్తం 45మంది కొత్తవాళ్ళు ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతారట. తేజ సినిమాల్లో కొత్త వాళ్ళు ఉండడం కామనే. ఆయన చేసిన చాలా సినిమాల్లో కొత్తవాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. మరి ఇప్పుడు హోరో హీరోయిన్లే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం కొత్తవారే ఉంటున్నారు. మరి కొత్తవారితో తీస్తున్న చిత్రం 1.1 సినిమా తేజకి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ఆర్ పీ పట్నాయక్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

TOP STORIES

ఐపీఎల్ 2021 షెడ్యూల్ విడుద‌ల‌.. మ్యాచ్‌లు జ‌రిగే తేదీలు ఇవే..!

కోవిడ్ నేప‌థ్యంలో గ‌తేడాది ఐపీఎల్ ఆల‌స్యంగా జ‌రిగినా ఈ ఏడాది మాత్రం అనుకున్న తేదీల‌కే ఐపీఎల్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ప్రేక్షకులు గ‌తేడాది వేస‌విలో ఐపీఎల్‌ను...