ఉప్పెన సినిమా మీద మహేశ్ ప్రసంశల వర్షం

Join Our Community
follow manalokam on social media

చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కన్నడ భామ కృతి శెట్టి నటించిన ఉప్పెన సినిమా మంచి పాజిటివ్ బజ్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే చాలా రికార్డులు బద్దలుకొట్టిన ఈ సినిమా మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే విధంగా ముందుకు పోతోంది. ఇక ఈ సినిమా గురించి మామూలు ప్రేక్షకులతో పాటుగా సినీ సెలబ్రిటీలు కూడా ప్రసంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా ఒక క్లాసిక్ అంటూ ట్వీట్ చేశారు.

” ‘ఉప్పెన’ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇదొక క్లాసిక్‌ మూవీ, బుచ్చిబాబు నువ్వొక అరుదైన కాలాతీతమైన సినిమాను తెరకెక్కించావు నిన్ను చూసి గర్వపడుతున్నా” అని ఆయన ట్వీట్ చేశాడు. అలానే వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టిని ఉద్దేశించి మీలాంటి కొత్త వాళ్ళు ఇలాంటి అధ్బుతమైన పెర్ఫామెన్స్ ఇవ్వడం బాగుందని ఆయన అన్నారు. అలానే  ఉప్పెన వంటి సినిమాను వెనుక ఉండి సపోర్ట్ చేసిన సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్‌కు అభినందనలు. మీ టీమ్‌ను చూసి గర్వపడుతున్నాను” అంటూ మహేశ్‌ ట్వీట్ చేశారు.

TOP STORIES

EPF: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్… వివరాలు ఇవే…!

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ అనేది జీతం ఉన్న వ్యక్తుల కోసం ప్రభుత్వ యాజమాన్యం తో నడిచే పెన్షన్ ప్లాన్. దీంతో ప్రతి నెల 12...