ఈ తప్పుల వల్లే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది..!

-

చాలామంది కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు నిజానికి మనం చేసే కొన్ని కొన్ని తప్పుల వలన అది మన ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆరోగ్యము విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి మంచి ఆహారం తీసుకోవడం సరైన జీవన విధానాన్ని అనుసరించడం ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతే రకరకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ తర్వాత ఎంతగానో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో కొలెస్ట్రాల్ సమస్య చాలా కామన్ అయిపోయింది. ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతే దాంతో రకరకాల సమస్యల్ని ఎదుర్కోవాలి.

స్ట్రోక్, టైప్ టు డయాబెటిస్, హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదకరమైన సమస్యలు కొలెస్ట్రాల్ కారణంగా కలగవచ్చు. చిన్న చిన్న తప్పులు పెద్ద పెద్ద ప్రమాదానికి గురి చేసే అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ పెరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి..? ఎటువంటి తప్పులు చేయకూడదు అనేది చూద్దాం.. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఆరోగ్యయానికి హాని చేసే ఆహార పదార్థాలను పదే పదే తినడం వలన రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ప్యాకేజ్డ్ ఫుడ్ మాంసం ప్రాసెస్డ్ ఫుడ్ వంటివి తీసుకోకూడదు. వీటిలో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంటుంది వీటిని తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ మరింత పెరిగిపోతాయి.

ప్రమాదకరమైన సమస్యలు తగ్గుతాయి. సరిగ్గా వ్యాయామం చేయకపోతే కూడా కొలెస్ట్రాల్ సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి రెగ్యులర్ గా వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యం. మీ రోజులో కాస్త సమయంని వ్యాయామం కోసం వెచ్చించండి. రోజుకి 30 నిమిషాలు పాటు వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. ధూమపానం వలన కూడా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ధూమపానం చేయడం వలన మంచి కొలెస్ట్రాల్ తగ్గి చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది దీంతో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. చెడు కొలెస్ట్రాల్ కూడా బాగా పెరిగిపోతుంది. ఇలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news