క్యాబ్ డ్రైవర్​కు గుండెపోటు.. కారును నియంత్రించి కాపాడేందుకు సీఐ యత్నం

-

క్యాబ్ నడుపుతుండగా డ్రైవర్​కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. గమనించిన ప్రయాణికురాలు అప్రమత్తమై కారును నియంత్రించడానికి ప్రయత్నించింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న సీఐ గమనించిన కారును నియంత్రించి డ్రైవర్​కు సీపీఆర్ చేసి కాపాడేందుకు ప్రయత్నించారు. వెంటనే ఆస్పత్రికి తరలించినా అతడి ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

మలక్‌పేట్‌ ధోబీగల్లీకి చెందిన కావలి శ్రీనివాస్‌(40) క్యాబ్‌ నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. గురువారం సాయంత్రం 5గంటల సమయంలో క్యాబ్‌లో ఓ కుటుంబాన్ని యాదగిరిగుట్టకు తీసుకెళ్తున్నాడు. ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ దాటి కాస్త ముందుకెళ్లగానే శ్రీనివాస్‌కు గుండెనొప్పి రావడంతో గేర్‌ రాడ్‌ వైపు కుప్పకూలిపోయాడు. వెనుక సీటులో ఉన్న ప్రయాణికురాలు అప్రమత్తమై తన సీటులోనుంచే స్టీరింగ్‌ నియంత్రించేందుకు ప్రయత్నించారు.

అదే సమయంలో ఆ మార్గంలో వెళుతున్న రామన్నపేట సీఐ మోతీరామ్‌ ముందున్న కారు నెమ్మదిగా వెళ్లడం గమనించారు. వెంటనే కిందకు దూకి, మరో వ్యక్తి సాయంతో ఆ కారును నియంత్రించారు. డ్రైవర్‌ శ్రీనివాస్‌ను బయటకు తీసి సీపీఆర్‌ చేసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news