ఏపీ పోలీస్ శాఖలో విషాదం.. షటిల్ ఆడుతూ సీఐ మృతి !

Join Our Community
follow manalokam on social media

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా గణపవరం సి ఐ భగవాన్ ప్రసాద్ గుండెపోటుతో మరణించారు. అది కూడా ఆడుతూ భగవాన్ ప్రసాద్ కుప్పకూలడం సంచలనంగా మారింది. ఆయన కుప్పకూలుతున్న విజువల్స్ సీసీటీవీలో రికార్డ్ కావడంతో మరింత విషాదం నెలకొన్నట్టు అయింది.

పశ్చిమగోదావరి జిల్లా గణపవరం సీఐ డేగల భగవాన్ ప్రసాద్ (42) గుండెపోటుతో మృతి చెందారు. ఎప్పటిలాగే విధులు పూర్తిచేసుకుని నిడమర్రు మండలం భువనపల్లిలో షటిల్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన గుండెపోటుతో మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. సీఐకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సీఐ మరణ వార్త తెలియగానే పలువురు పోలీసు అధికారులు సంతాపం తెలిపారు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...