నేటి నుంచి విద్యాసంస్థలు బంద్..మరి పరీక్షల పరిస్థితి ఏంటి ?

-

దేశంలో మరో మారు కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల అన్నిటినీ నేటి నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిజానికి పదో తరగతి వరకు పాఠశాలలు మూసివేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు పంపినా రిస్క్ తీసుకోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేని సర్కార్ ఒక్క మెడికల్ కళాశాలలు మినహా మిగిలిన అన్ని విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

అయితే ఇప్పుడు పరీక్షలు జరుగుతాయా… లేదా? అనేది టెన్షన్ గా మారింది. ఎందుకంటే లెక్క ప్రకారం ఇంటర్ పరీక్షలు మే 1 నుంచి 19 వరకు, పదో తరగతి పరీక్షలు మే 17 నుంచి 26 వరకు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విద్యాసంస్థలను మూసివేయడంతో వార్షిక పరీక్షలు జరుగుతాయా… లేదా? అనే సందిగ్ధం నెలకొంది. మరోపక్క ఓయూ, జేఎన్​టీయూలో జరుగుతున్న యూజీ, పీజీ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం జరుగుతాయని ఆయా యూనివర్శిటీలు ప్రకటించాయి. పాలమూరు యూనివర్సిటీ పరీక్షలు కూడా యదాతదంగా జరుగుతాయి అని ఆ యూనివర్సిటీ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news