చంద్రబాబుకు షాక్.. మరో స్కాంపై సీఐడీ విచారణకు జగన్ సర్కార్ ఆదేశాలు !

-

అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. టిడిపి ప్రభుత్వ హయాంలో జరిగిన మరో స్కామ్ పై జగన్ సర్కార్ ఫోకస్ చేసింది. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది జగన్ సర్కార్. ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి నివేదిక ఆధారంగా సీఐడీ విచారణకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఫైబర్ నెట్ స్కామ్ పై విచారణ జరపాలని గతంలోనే సీబీఐను కోరింది రాష్ట్ర ప్రభుత్వం. విచారణ చేపట్టే అంశంపై సీబీఐ స్పందించకపోవడంతో సీఐడీకి విచారణ అప్పగించింది ప్రభుత్వం. సుమారు రూ. 700-1000 కోట్ల మధ్య ఫైబర్ నెట్ ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందని గతంలోనే ఆరోపణలు వచ్చాయి. సెట్ టాప్ బాక్సుల కొనుగోళ్లు, ఫైబర్ నెట్ కు సంబంధించి వివిధ టెండర్లను ఖరారు చేసే క్రమంలో అక్రమాలు జరిగాయన్నది ప్రధాన అభియోగంగా ఉంది.

టెరా సాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శలు వస్తున్నాయి. తప్పుడు పత్రాలతో ఫైబర్ నెట్లో నిబంధనలకు విరుద్దంగా నియామకాలు జరిగాయనే ఆరోపణలు కూడా టిడిపి సర్కార్ పై ఉన్నాయి. అప్పటి ఐటీ మంత్రి లోకేష్, ఐటీ సలహాదారు వేమూరి హరికృష్ణ ప్రసాద్ మీద గతం నుంచి ఆరోపణలు గుప్పిస్తోంది ఏపీ ప్రభుత్వం. అయితే ఈ ఆరోపణలపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news