టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో భాగంగా అరెస్ట్ కాబడి రాజమండ్రి సెంట్రల్ జైలులో 50 రోజులకు పైగా రిమాండ్ లో ఉన్నాడు. కాగా చంద్రబాబు లాయర్లు ఇన్ని రోజులుగా బెయిల్ ను సంపాదించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఇక ఇటీవల చంద్రబాబు ఆరోగ్య సమస్యలను పిటిషన్ లో పేర్కొని మధ్యంతర బెయిల్ ను అప్లై చేయడానికి ట్రై చేశారు. ఈ పిటిషన్ విచారణలో సిఐడి తరపున లాయర్లు చంద్రాబుకు అవసరం అయిన అన్ని పరీక్షలను నిర్వహిస్తున్నామంటూ కోర్టుకు తెలియచేశారు. చంద్రబాబుకు అవసరం అయిన అన్ని మందులను అందిస్తున్నాం అంటూ తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబుకు ఉన్నవి అన్నీ కూడా చిన్న చిన్న సమస్యలేం అంటూ కోర్టుకు సిఐడి తరపు లాయర్లు తెలియచేశారు.
ఇంకా చంద్రబాబు నాయుడు కొన్ని టెస్ట్ లను చేయడానికి సహకరించడం లేదంటూ భువనేశ్వరికి రెండు సార్లు తెలియచేశామన్నారు, కానీ ఆమె స్పందించడం లేదు అంటూ సిఐడి తరపున లాయర్లు కోర్టుకు విన్నవించుకున్నారు.