ఈ రోజు పూణే వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన శ్రీలంక ఆఫ్గనిస్తాన్ బౌలర్ల ముందు పూర్తిగా తేలిపోయారు అని చెప్పాలి. బ్యాటింగ్ సహకరించే పూణే పిచ్ పై సాధారణ ప్రదర్శన చేసి శ్రీలంక కేవలం 241 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఓపెనర్ పతుమ్ నిస్సంక ఒక్కడే 46 పరుగులు చేసి హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత కుషాల్ మెండిస్ (39), సమరవిక్రమ (36), తీక్షణ (29), మత్యుస్ (23) లు పర్వాలేదనిపించే ప్రదర్శన చేశారు. ఇక ఆఫ్గనిస్తాన్ బౌలర్లలో ఫజల్ హాక్ ఫరూఖీ నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇతనికి ముజీబ్ (2) నుండి చక్కని సహకారం లభించింది. కాగా శ్రీలంక నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని చేధించే బాధ్యతను తీసుకుంటున్న ఆఫ్గనిస్తాన్ గెలుస్తుందా లేదా అన్నది తెలియాలంటే కాసేపు ఆగాల్సిందే.
నిదానంగా ఆడితే ఈ మ్యాచ్ లో గెలవడం అంత కష్టం కాదు. ఈ ఛేజ్ లో అఫ్ఘానిస్తా లో ఇబ్రహీం, రహమత్ షా, హస్మదుల్లా మరియు ఒమర్ జై లు కీలకం కానున్నారు.