సినిమా షూటింగ్ అనే విషయాన్నే ఇప్పుడు సినిమా మర్చిపోయింది. ఈ ఏడాది ఏ సినిమా కూడా విడుదల చేసే అవకాశాలు కనపడటం లేదు అనేది వాస్తవం. ఒక్క సినిమాను కూడా ఇప్పుడు షూటింగ్ చేసే పరిస్థితి లేక కెమెరాను మూసి వేసి గదిలో పెట్టారు. అగ్ర నటులు, దర్శక నిర్మాతలు అందరూ కూడా ఇప్పుడు ఖాళీ గా ఉన్నారు. లాక్ డౌన్ ని ఎత్తివేసినా సరే సినిమా షూటింగ్ ని అనుమతించే అవకాశం లేదు.
లాక్ డౌన్ ఎత్తేసినా సరే రెండు మూడు నెలల తర్వాతే షూటింగ్ లు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఇప్పుడు లాక్ డౌన్ లో ప్రజలు పడుతున్న కష్టాలను ఒక చిన్న సినిమా రూపొందించారు. కరోనా లాక్ డౌన్ లో పడుతున్న కష్టాలను ‘లాక్‌డౌన్’ పేరిట ఓ లఘు చిత్రాన్ని ఐఫోన్ లో షూట్ చేసారు. దీనికి దర్శకుడు ఆదవ్ కణ్ణదాసన్ కథ అందించడమే కాకుండా దర్శక బాధ్యతలను నిర్వహించారు.
ప్రముఖ నాయిక ఆండ్రియా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ లఘు చిత్రాన్ని పూర్తిగా ఐఫోన్‌లోనే షూట్ చేసినట్టు సినిమా యూనిట్ చెప్పింది. ఆర్ట్ వెంచర్ ఫిలిమ్స్ బ్యానరుపై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి నితిన్‌రామ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. కార్తిక్ ఎడిటర్ గా… బాధ్యతలు నిర్వహించారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.