తమిళనాడులో పోలిటికల్ హీట్ ..సినీ గ్లామర్ చుట్టూ రాజకీయ కుట్రలు…!

ఎన్నికల సమీపిస్తున్న కోద్ది తమిళ రాజకీయాలు ఆసక్తిరేపుతున్నాయి. రజనీ రాజకీయాల్లోకి రావడం లేదని ఒకరోజు వార్త వస్తే.. మరోరోజు డీఎంకేతో కమల్ హాసన్ పొత్తు అంటూ మరో వార్త వినిపిస్తోంది. తాజాగా ఇళయ దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడని ప్రచారం జోరందుకుంది. ఇలా తమిళ నటుల చూట్టు ఫేక్ పొలిటికల్‌ గేమ్ సాగుతుందని చెన్నై కోడై కూస్తోంది.

ఎన్నికలు సమీపిస్తూన్న కోద్ది తమిళనాడులో పోటికల్ హీట్ పెరుగుతోంది. ఎవరి మూడ్ ఎలా ఉందో చూసుకోవడానికి అప్పుడే పార్టీలు గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నాయి. సాదారణంగా ఎన్నికలంటే రాజకీయాలు పార్టీల చూట్టు వ్యవహారం సాగుతుంది. అయితే అందుకు భిన్నంగా తమిళనాట మాత్రం సినీ గ్లామర్ చూట్టు రాజకీయ కుట్రలు సాగుతున్నాయాని టాక్ బలంగా వినిపిస్తోంది. దీనికంతటికి కారణం అక్కడి ద్రావిడ పార్టీలే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎవరు కాదన్నా.. అవునన్నా.. తమిళనాడులో సిని గ్లామర్ కే ఓట్లు పడుతాయి …అందులో డౌట్ లేదు. అలా సినీ నటులు చాలామంది రాజకీయాల్లో ప్రవేశించి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే, ప్రధాన పార్టీలైన డిఎమ్‌కె , ఎఐడిఎంకెలు కరుణానిథి,జయలలిత వంటి కీలక నేతల్ని కోల్పోయి దిక్కుతోచని స్టితిలో పడ్డాయి. తొలిసారి గ్లామర్ లేకుండా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు పార్టీలకు చెక్ పెట్టి సిఎం పీఠాన్ని అదిష్ఠించాలని ఆశతో కమల్‌, రజనీలు అడుగులు వేస్తుండగా.. ముందే వీరికి చెక్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నా డీఎంకే, అన్నా డీఎంకేలు.

మొదట రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదనే నకిలీ లేఖ కలకలం రేపింది. అదికాస్తా వైరల్ కావడంతో రజనీ అభిమానుల్లో అయోమయం ఏర్పడింది. ఆ తర్వాత అది ఫేక్ లెటర్‌ అని తేలింది. ఇక మక్కల్ మీది మయ్యం పార్టీ అధినేత కమల్ హసన్‌కు కూడా ఈ సెగ తగిలింది. కమల్.. డిఎమ్‌కె తో కలసి పోటిచేస్తున్నాడని. ఎన్నికల తర్వాత విలీనం చేస్తాడని ప్రచారం మొదలెట్టారు. అదంతా అబద్ధమని కొట్టిపారేశారు కమల్‌.

ఇప్పుడు, తాజాగా మరో కీలక నటుడు విజయ్ వంతు వచ్చింది. ఆల్ ఇండియా విజయ్ మక్కల్ ఇయాక్కమ్ అనే పార్టీని నమోదు చేశారనే వార్త గుప్పుమంది.అయితే తన రాజకీయ ప్రవేశం, పార్టీ ఏర్పాటు గురించి మీడియాలో వస్తున్న వార్తల్ని కొట్టిపారేశారు విజయ్‌. ఆ పార్టీని నమోదు చేసుకొన్నది విజయ్ కాదు.. ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ అనే వార్త వెలుగులోకి వచ్చింది. ఇదంత హీరో విజయ్.. పొలిటికల్ స్టంట్ అని కూడా అంటున్నారు. 2026నాటికి పార్టీ పెట్టి, ప్రజల్లోకి తీసుకెళ్లడమంటే అంత ఈజీ కాదు. దీంతో విజయ్‌ ఆలోపే పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చి, తండ్రి ఏర్పాటు చేసిన పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉందంటున్నారు అతడి ఫ్యాన్స్‌.

ఐతే ఇదంతా… ద్రావిడ పార్టీలు వెనుకుండి ఆడిస్తున్న డ్రామా అనేవారూ లేకపోలేదు. ప్రజల మూడ్ గ్రహించడంతో పాటు… నటులకు పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి ఉందో లేదో తెలుసుకునేందుకు ఆ పార్టీలు ఇలాంటి లీకులు ఇస్తున్నారనే వాదనలు ఉన్నాయి.