ఆ పని చేయకపోతే ఇక ఎన్నికల్లో పోటీ చేయను : కొడాలి నాని

చంద్రబాబు,టిడిపి నాయకులపై మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు,అతని అనుచరులను జగన్నాథ రథ చక్రాల కింద నల్లిని నలిపినట్లు నలిపేస్తామని అన్నారు. ఈరోజు గుడివాడలో ప్రజలలో నాడు, ప్రజల కోసం నేడు అంటూ పార్టీ పిలుపినిచ్చిన పాదయాత్రని నిర్వహించారు కొడాలి నాని. నా ఇల్లు, నా సొంతం అంటూ ఓడిపోయిన టిడిపి నాయకులందరూ రోడ్లు ఎక్కి షో చేస్తున్నారన్న అయన చంద్రబాబు కు దమ్ము ఉంటే గుడివాడ వచ్చి ఒక్క ఇల్లు అయిన ఇచ్చి చూపించాలని సవాల్ చేశారు.

చంద్రబాబు కోర్టులకు వెళ్లి ఇల్లా స్థలాల పంపిణీ అడ్డుకుంటున్నారన్న నాని గుడివాడలో 25 వేల మంది లబ్ధిదారులకు, 2024 లోపు ఇల్లు కట్టించి ఇవ్వకపోతే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. చంద్రబాబు,అతని అనుచర గణం ఎన్ని కుట్రలు పన్నినా,రాష్ట్రంలో 30లక్షల మందికి ఇల్లా స్థలాలు ఇచ్చి తీరుతాం నాని పేర్కొన్నారు. జూమ్ బాబు, మాటలు విని రోడ్లు ఎక్కే టిడిపి నాయకుల సంగతి తేలుస్తామని ఆయన హెచ్చరించారు.