రాష్ట్రంలో ప్రారంభమైన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష…

-

ఆలిండియా సర్వీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన సివిల్స్ 2020 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రారంభమైంది. ఉదయం 9.30 నుంచి 11.30వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తున్నారు. కరోనా నేపధ్యంలో పరీక్షలు వాయిదా వేయాలన్న పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టేయడంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే కరోనా నిబంధనలు, సుప్రీం సూచనలకు అనుగునంగా పరీక్షలు జరుగుతున్నాయి.

దేశ వ్యాప్తంగా మొత్తం 72 పట్టణాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకోసం మొత్తం 115 సెంటర్లను ఏర్పాటు చేశారు అధికారులు. హైదరాబాద్ లో 99, వరంగల్ లోని 16 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో 46 వేల 171 మంది వరంగల్ కేంద్రాల్లో 6 వేల 763 మంది అభ్యర్ధులు పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షల కోసం వెన్యూ సూపర్ వైజర్లతో పాటు 99 లోకల్ ఇన్సిపెక్షన్ అధికారులు, 34 మంది రూట్ ఆఫీసర్లును నియమించారు. ఏపీలోని విశాకపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో మొత్తంగా 68 పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news