సివిల్స్ టాపర్ మార్కులు ఎంతో తెలుసా.. తెలిస్తే షాకే..

-

దేశంలో చాలా మంది విద్యావంతుల కల. కానీ కొంతమందికే సాధ్యమయ్యే కఠినమైన పరీక్ష అదే యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్. ఏళ్లకేళ్లకు శిక్షణ తీసుకున్నా అందరికీ సాధ్యపడనిది. ఏటా లక్షల మంది పరీక్ష రాస్తే చివరికి విజయం వరించేది కొందరినే. అదికూడా సివిల్స్ కు సెలెక్ట్ అయ్యేది కేవలం వేలలోపు మంది మాత్రమే. ఇలా సెలెక్ట్ అయిన వారు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ప్రతిష్టాత్మక పోస్టుల్లో కొలువుతీరుతారు. ఇలాంటి పరీక్షలో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయనేది అందరికీ ఆసక్తి ఉంటుంది. తాజాగా విడుదలయిన సివిల్స్ ర్యాంకుల్లో శుభమ్ కుమార్ ఆల్ ఇండియా టాపర్ గా నిలిచారు. రెండో స్థానంలో జాగ్రతి అవస్థి ఉన్నారు. 1054 మార్కులు 52.04 శాతం మార్కులతో శుభమ్ కుమార్ టాపర్ గా నిలిచారు. ఇందులో 875 మార్కులు రాతపరీక్షలో సాధించగా, 176 మార్కులు ఇంటర్వ్యూలో సాధించారు. రెండోస్థానంలో ఉన్న జాగ్రతి అవస్థి 51.94 శాతం మార్కులను సాధించారు. మొత్తం మార్కులను 2025 సివిల్స్ పరీక్ష జరుగుతుంది. వీటిలో 1750 రాత పరీక్ష ఉంటే, 275 మార్కులు ఇంటర్వ్యూ ఉంటుంది. 2020లో జరగిన ఈ సివిల్స్ పరీక్షలో 4 లక్షలపైగా విద్యార్థులు రాస్తే కేవలం 761 మంది సెలెక్ట్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news