ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బర్ద్ ఫ్లూ టెన్షన్ నెలకొంది. తాజాగా ఈ అంశంమీద తెలంగాణ మంత్రులు స్పందించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ బర్ద్ ఫ్లూ ఆనవాళ్ళు
ఇక తెలంగాణ లో బర్డ్ ఫ్లూ లేదన్న ఈటెల రాజేందర్ వచ్చే అవకాశం సైతం లేదన్నారు. ప్రజలు అపోహలకు గురి కావొద్ద నీ, కరోనా తో ఇప్పటికే పోల్ట్రి రంగం కుప్పకూలింది, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వ్యవస్థను మళ్లీ కష్టాల్లోకి నెట్టొద్దన్నారు. చికెన్ తింటే ఫ్లూ వస్తుందని ఎక్కడా నిరూపణ కాలేదు, అయినా గుడ్ల ను, కూరను బాగా ఉడికించి తినే సంస్కృతి మనది కాబట్టి మనకు ఎలాంటి టెన్షన్ లేనట్టే నని అన్నారు. పౌల్ట్రీ రంగం పై ఆధార పడి వేల కుటుంబాలు జీవిస్తున్నాయి, అపోహలతో మళ్లీ రోడ్డున పడేలా చేయొద్దని కోరుతున్నామని అన్నారు.