తెలుగు సినిమాల్లో ఇప్పుడు విడుదలకు రెడీగా ఉన్న సినిమాల్లో అత్యంత అంచనాలున్న మూవీ ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల కాంబో కావడం ఒక విషయం అయితే… ఇందులో రామ్ చరణ్ నటిస్తుండటం మరో సంచలనం. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదరుచూస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఈ మూవీ వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ రిలేషన్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదరుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ ‘ఆచార్య’ సినిమా పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది. చరణ్ పాత్ర కూడా ఎంతో కీలకమట.
ఇందులో చిరంజీవి,రామ్ చరణ్ తండ్రికొడుకులు కాదని’ తాజాగా కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు. రాష్ట్రంలోని దేవాలయాలు, ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ కనిపించనున్నాడు. చిరంజీవికి సాయం చేసే వ్యక్తిగా రామ్ చరణ్ ఉంటాడని తెలుస్తోంది. ఇందులో కాజల్, పూజాహెగ్దే హీరోయిన్లుగా నటిస్తున్నారు.