వైరల్‌ వీడియో.. సర్కస్‌లో ట్రెయినర్‌పై దాడి చేసిన సింహం..

-

ఇప్పుడంటే సర్కస్‌లను చూసే జనాలే కరువయ్యారు. కానీ ఒకప్పుడు సర్కస్‌లకు విపరీతమైన క్రేజ్‌ ఉండేది. సర్కస్‌లో వ్యక్తులు, జంతువులు చేసే విన్యాసాలను చూసి ప్రేక్షకులు వినోదాన్ని పొందుతుంటారు. అయితే సర్కస్‌లో జంతువులు ఆడించినట్లు ఆడితే బాగానే ఉంటుంది, కానీ అవి మనుషులపై దాడి చేస్తేనే ప్రమాదం. అలాంటి సంఘటనలు దాదాపుగా జరగవు. కానీ అదృష్టం బాగాలేకపోతే సర్కస్‌లోని జంతువులు కూడా దాడి చేస్తాయి. రష్యాలో సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…

lion attacked trainer in circus viral video

రష్యాలో మే 22వ తేదీన ఉరల్‌ ట్రావెలింగ్‌ సర్కస్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. అందులో మాగ్జిమ్‌ ఒర్లొవ్‌ అనే వ్యక్తి వెగా, శాంటా అనే రెండు సింహాలతో విన్యాసాలను ప్రదర్శిస్తున్నాడు. అయితే అనుకోకుండా వెగా అనే సింహం అతనిపై దాడి చేసింది. అతన్ని తీవ్రగాయాలకు గురి చేసింది. ఈ సంఘటనతో భయభ్రాంతులకు లోనైన ప్రేక్షకులు అక్కడి నుంచి బయటకు పరుగెత్తారు.

అయితే సర్కస్‌ సిబ్బంది వెంటనే స్పందించి సింహాన్ని బంధించారు. మాగ్జిమ్‌ను వెంటనే చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అదృష్టవశాత్తూ అతనికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అతను తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉంది. సాధారణంగా సర్కస్‌లలో ఇలాంటి సంఘటనలు అసలు జరగవు. అత్యంత అరుదుగా జరుగుతుంటాయి. కానీ ఈ విధంగా ప్రమాదం జరగడం అందరినీ షాక్‌కు గురి చేసింది. అయితే ఆ సమయంలో తీసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో జంతువులను అలా హింసిస్తన్న సర్కస్‌ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు జంతు ప్రేమికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news