ప్రియాంక చోప్రా నిక్ విడాకుల పై క్లారిటీ…!

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా తన ఇన్స్టా గ్రామ్ ఖాతానుండి భర్త పేరును తొలగించింది. దాంతో ఒక్కసారిగా ఈ వార్త చర్చనీయాంశం అయ్యింది. ప్రియాంక నిక్ లు విడాకులు తీసుకుంటారని….వారి మధ్య ఎదో జరిగిందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అయితే ఆ వార్తలపై తాజాగా ప్రియాంకా చోప్రా తల్లి మధు చోప్రా స్పందించింది. ఆ వార్తలన్నీ పుకార్లేనని మధు చోప్రా స్పష్టం చేసింది. అదంతా చెత్త పుకార్లు అంటూ ప్రియాంకా తల్లి ఖండించింది.

ఇదిలా ఉండగా ప్రియాంకా చోప్రా తనకంటే ఎనిమిదేళ్లు చిన్నవాడైన నిక్ జోనాస్ ను ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఇద్దరూ లండన్ లో ఉంటున్నారు. ఇక సమంత కూడా ఇదే విధంగా మొదట సోషల్ మీడియా నుండి అక్కినేని అనే పేరును తొలగించడం…ఆ తరవాత విడాకులు తీసుకోవడంతో ప్రియాంక కూడా అలానే చేస్తుందని పుకార్లు మొదలయ్యాయి. కానీ ఆ వార్తల్ని ప్రియాంకా తల్లి ఖండించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.