కైకల సత్యనారాయణ హెల్త్ బులిటెన్ విడుదల

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గత నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. బాత్ రూమ్ లో కాలు జారి పడటంతో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కైకాల సత్యనారాయణ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు ఆయన కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే అపోలో ఆసుపత్రి వైద్యులు కైకల సత్యనారాయణ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

ఐసీయూలో వెంటిలేటర్ పై కైకల సత్యనారాయణ కు వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు వైద్యులు. రక్తపోటు తగ్గిందని కిడ్నీ పనితీరు చాలా మెరుగుపడిందని వైద్యులు పేర్కొన్నారు. త్వరలోనే ఆయన కోలుకుంటారని బులెటిన్లో పేర్కొన్నారు వైద్యులు. కైకాల సత్యనారాయణ కోలుకుంటున్నట్టు  అటు  ఆయన కూతురు రమాదేవి కూడా చెప్పారు. కైకాల ఆరోగ్యం పై ఆడియో వాయిస్ ద్వారా ఆమె తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందని… అందరితో మాట్లాడుతున్నారని వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందక్కర్లేదని..దయచేసి అనవసర వార్తలతో జనాలను ఆందోళన పరచవద్దని రమాదేవి కోరారు.