మా ఎన్నిక‌లు..మ్యానిఫెస్టో ప్ర‌క‌టించిన సీవీఎల్..!

గ‌త కొన్నివారాలుగా మా ఎన్నిక‌ల టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్, సీవీఎల్ న‌ర‌సింహారావు, మంచు విష్ణు పోటీలో దిగుతున్న‌సంగ‌తి కూడా తెలిసిందే. అయితే వీరిలో ముందు నుండి ప్ర‌కాష్ రాజ్ దూకుడు గా వ్యవ‌హరిస్తున్నారు. ఇక మంచు విష్ణు మా బిల్డింగ్ అనే స్లోగ‌న్ తో ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుతున్నారు. ప్ర‌కాష్ రాజ్ చాలా హామీల‌ను ఇచ్చారు. సీవీఎల్ న‌ర‌సింహారావు తెలంగాణ ఆర్గ్యుమెంట్ తో ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నారు.

cvl narasimha rao
cvl narasimha rao

తెలంగాణ క‌ళాకారుల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని తెలంగాణ క‌ళాకారుల కోసం ప్ర‌త్యేక‌మైన సంఘం కోసం పోరాడుతున్నారు. ఇక తాజాగా సీవీఎల్ త‌న ఎన్నిక‌ల మ్యానిఫెస్టోను కూడా విడుద‌ల చేశారు. అందులో తాను గెలిస్తే చేసే ప‌నుల‌ను ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా వ‌చ్చే నెల 10న మా అధ్య‌క్ష ఎల‌క్ష‌న్స్ నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌రి ఈ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారో చూడాలి.