ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ పుట్టిన రోజు సందర్బంగా ఇవాళ ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. “మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు జగన్ గారు. మీకు చక్కని ఆరోగ్యం, సుదీర్గ జీవితం ఉండాలని కోరుకుంటున్నా” అని ట్వీట్ చేశారు. తన రాజకీయ ప్రత్యర్థికి చంద్రబాబు విషెస్ చెప్పడంతో సోషల్ మీడియాలో వైసీపీ, టీడీపీ ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చలు జరుగుతుండటం విశేషం.
గతంలో చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా జగన్ కూడా విషెష్ చెప్పారు. సీఎం చంద్రబాబు తో పాటు గవర్నర్, పలువురు వైసీపీ నేతలు వైఎస్ జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని.. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.