సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు.రేపు నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే నీతి ఆయోగ్ భేటీలో ఏపీ అభివృద్ధిపై చంద్రబాబు ప్రస్తావించనున్నారు.వికసిత్ భారత్-2047లో భాగంగా వికసిత్ ఆంధ్ర ప్రదేశ్-2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన ఏపీ సర్కార్ చేపట్టనుంది.వికసిత్ ఏపీ-2047లోని అంశాలను నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు నాయుడు ప్రస్తావించనున్నారు.
వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో సీఎం చెప్పనున్నారు.ఏపీలో ప్రైమరీ సెక్టార్ పరిధిలోకి వచ్చే వ్యవసాయం, ఆక్వా రంగాలకున్న అవకాశాలను నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించనున్నారు.జీడీపీ గ్రోత్ రేట్ పెరుగుదలకు తాము పెట్టుకున్న టార్గెట్.. చేపట్టనున్న ప్రణాళికలను చంద్రబాబు వివరించనున్నారు.సేవల రంగ అభివృద్ధికి ఏపీలో ఉన్న అవకాశాలను డిజిటల్ కరెన్సీ అవశ్యకతను నీతి ఆయోగ్ భేటీలో ఏపీ సీఎం చంద్రబాాబు నాయుడు వివరించనున్నారు.