ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు

-

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు, నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చంద్రబాబు ఢిల్లీ టూర్ ఉండనుంది.ఈ పర్యటనలో ప్రధాని మోడీ, కేంద్ర హోం మినిస్టర్ అమిత్‌షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. పోలవరం, అమరావతి పూర్తి, రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నివేదిక ఇవ్వనున్నారు.

అయితే, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు తొలిసారిగా ఢిల్లీకి వెళ్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించిన అంశాలన్నీ కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపెడతామనే కూటమికి 164 సీట్లు కట్టబెట్టారు.. రాష్ట్ర పునర్నిర్మాణం అందరి బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news