ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసిన హెలికాప్టర్ ఫోటోలు వైరల్ గా మారాయి. కొత్త హెలికాప్టర్ ను ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు వినియోగిస్తున్నారు. ఇదివరకు బెల్ తయారుచేసిన చాపర్ వాడేవారు సీఎం చంద్రబాబు నాయుడు.

అయితే ఆ చాపర్ ఎక్కువ దూరం ప్రయాణించేందుకు పనికి రాకపోవడంతో అత్యాధునిక ఆ ఫీచర్లతో కూడిన ఎయిర్బస్ హెచ్ 160 మోడల్ హెలికాప్టర్ ను చంద్రబాబు నాయుడు వాడుతున్నారు. సన్ లైట్ తగ్గినా… ఆకాశం మేఘవృతమైనప్పటికీ కొన్ని హెలికాప్టర్లకు అనుమతి అసలు ఇవ్వరు అన్న సంగతి తెలిసిందే. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ చాపర్ లో లైటింగ్ తక్కువ ఉన్నా కూడా ప్రయాణించేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అందుకే చంద్రబాబు నాయుడు ఈ హెలికాప్టర్ వాడుతున్నట్లు చెబుతున్నారు.