టీడీపీ సర్కార్ మరో కుంభకోణం పై సీఎం జగన్ ఫోకస్

టీడీపీ హయాంలో జరిగిన మరో కుంభకోణాన్ని వెలికి తీసేందకు సిద్దమైంది జగన్ సర్కార్‌. టీడీపీ హయాంలో గిరిజన శాఖ ద్వారా ఇచ్చిన..ఇన్నోవా వాహనాల్లో అవినీతిని వెలికి తీయనున్నారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను అదేశించారు డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి. ట్రైకార్‌ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని సూచించారు.

పరిశ్రమల శాఖ పరిధిలో స్టాండప్‌ ఇండియా కింద అప్పట్లో టిడిపీ సర్కార్ ఇన్నోవా కార్లను లబ్దిదారులకు అందించింది. అయితే ఆ ఇన్నోవా వాహనాల పంపిణీలో అవకతవకలపై ఇప్పుడు జగన్ సర్కార్ దృష్టి పెట్టింది. స్టాండప్ ఇండియా స్కీమ్ కింద రుణం పొందాలంటే ఎస్సీ, ఎస్టీ కులానికి చెందినవారై ఉండాలి. అలాగే మహిళలు ఎవరైనా రుణం తీసుకోవచ్చు. కొత్త వ్యాపారానికి మాత్రమే రుణం అందిస్తారు కానీ ఇందులో పలు అవతవకలు జరిగినట్లు జగన్ సర్కా్ భావిస్తుంది.