ఏపీ నిరుద్యోగులకు సీఎం జగన్మోహన్ రెడ్డి తీపికబురు చెప్పారు. కోవిడ్–19 నియంత్రణ, నివారణా చర్యలు, వ్యాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్. జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… వైద్యా రోగ్య రంగంలో ఖాళీలకు అక్టోబరు 20న నోటిఫికేషన్లు జారీ కాబోతున్నట్లు తెలిపారు.
డిసెంబర్ నెలాఖరులోగా ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. జాతీయ ప్రమాణాలను అనుసరించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది ఉండాలని చెప్పారు సీఎం జగన్. ఇందులో రాజీకి ఆస్కారం లేదని..కొత్తగా నిర్మించదలిచిన 176 పీహెచ్‌సీల నిర్మాణంపై వెంటనే దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
అలాగే కరోనా కారణంగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలలోని వారికి కారుణ్య నియామకాలు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదముద్ర వేశారు. ఈ కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు వారి కుటుంబాల వారికి కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. జనవరిలో పనులు ప్రారంభించి 9 నెలల్లోగా పూర్తిచేస్తామని అధికారులు సీఎం జగన్ కు వివరించారు.