సీఎం జగన్: ప్రతి మండలానికి రెండు కాలేజీలు…

-

తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యాశాఖ అధికారులతో ఒక సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షలో విద్యలో మరింత అభివృద్ధిని తీసుకురావడానికి అనేక విషయాలపై చర్చించారు. అందులో భాగంగా సీఎం జగన్ రాష్ట్రంలోని ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని… లేని మండలంలో వెంటనే నెలకొల్పడానికి ఆదేశాలు జారీచేశారు. ఈ ప్రక్రియను వచ్చే సంవత్సరం జూన్ నెలకు పార్టీ అయ్యేలా చూడాలని చెప్పారు. ఇక జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలను తీసుకుని రెండు గ్రామాలకులు కలిపి ఒక హై స్కూల్ ను ఏర్పాటు చేయాల్సిందిగా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పటికే అనేక మార్పులను తీసుకువచ్చిన జగన్.. తాజాగా అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు.

ఇక ముందు ముందు విద్యాశాఖలో మరిన్ని కీలక మార్పులు తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామని సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news