సర్కారు కొలువులు ఇచ్చే పరిస్థితి లేదు : కేటీఆర్‌

-

మంత్రి కేటీఆర్‌ ప్రభుత్వం ఉద్యోగాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో జిల్లా మూసాపేట మండలంలో ఎస్‌జీడీ ఫార్మా కార్నింగ్‌ టెక్నాలజీ ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్‌లో మున్సిపల్‌ పార్కు, ఓపెన్‌ జిమ్‌లను ప్రారంభించారు.

TRS has an edge in Munugodu, avers KTR

ఈసందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ.. తెలంగాణలో అందరికీ సర్కారు కొలువులు ఇచ్చే పరిస్థితి లేదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఐదారు నెలల్లో ఎన్నికలొస్తున్నయ్. ఇక సంక్రాంతి గంగిరెద్దుల్లాగా కాంగ్రెస్ , బీజేపీ నాయకులు గ్రామాల్లోకి వస్తరు. తెలంగాణ జనాభా నాలుగు కోట్లుంటే అందులో సర్కార్​కొలువులు ఆరున్నర లక్షలు మాత్రమే. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలిచ్చే పరిస్థితి ఎక్కడా ఉండదు. ప్రైవేట్ ఇండస్ట్రీస్ ద్వారానే ఉద్యోగాలు సాధ్యం. స్థానికులు అండగా నిలవాలి. ప్రపంచంలోనే లైఫ్ సైన్సెస్ ఫార్మా సూటికల్స్ కు తెలంగాణ హబ్ గా మారింది. దేవరకద్ర నియోజకవర్గంలో చెరువులు, కుంటలు 90 వేల ఎకరాలకు సాగునీరందుతోంది’ అని కేటీఆర్​ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news