ఏపీలోని దేవాలయాలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆలయాలను అర్చకులకు అప్పగించే అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆదాయం తక్కువ ఉండే.. ఆలయాలపై అదనపు భారాలు పడకుండా కీలక ముందడుగు వేసింది. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలు, ఇతరు హిందూ ధార్మిక సంస్థలు చట్టబద్దంగా దేవదాయ శాఖకు చెల్లించాల్సిన ఫీజుల నుంచి మినహాయింపు ఇచ్చింది సర్కార్.
రూ. 5 లక్షల లోపు ఆదాయం కలిగిన ఆలయాలకు దేవాదాయ శాఖ పీజుల నుండి మినహాయింపునిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి హర్షం చేశారు. తక్కువ ఆదాయం కలిగిన ఆలయాలకు ఫీజుల మినహాయింపు అభినందనీయమని.. కోర్టు సూచన మేరకు తక్షణం ఈ నిర్ణయాన్ని అమలు చేయడం సంతోషదాయకమని పేర్కొన్నారు స్వరూపానందేంద్ర. ఈ నిర్ణయంతో చిన్న ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు ఇబ్బందులు తగ్గుతాయని.. అర్చకుల జీతాల చెల్లింపునకు ఇబ్బందులు ఉండవన్నారు స్వరూపానందేంద్ర.