అమరావతి మెట్రో విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరును మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల సౌలభ్యం కోసం పేరు మార్చామని ప్రభుత్వం తన జీవోలో వెల్లడించింది. గతంలో పేరు మార్చిన వాటిని కూడా ప్రస్తావించింది.
నాగపూర్ మెట్రో ప్రాజెక్ట్ పేరును మహారాష్ట్ర మెట్రో రైల్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌గా మార్పు చేసినట్లు ప్రభుత్వం తన జీవోలో ప్రస్తావించింది. లక్నో మెట్రో ప్రాజెక్ట్ పేరును ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌గా మార్చినట్లు తన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం విశాఖలో తలపెట్టిన మెట్రో ప్రాజెక్ట్ పేరు అమరావతి మెట్రో రైల్ ప్రాజెక్ట్‌గా ఉండటంతో పేరు మార్చామని రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.