జగన్ మరో సంచలన నిర్ణయం…విదేశీ వ్యవహారాల కోసం ప్రత్యేక పోస్టు !

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి… మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీ వ్యవహారాల కోసం ప్రత్యేక పోస్టు ని క్రియేట్ చేస్తూ… ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ కి అంత ర్జాతీయ సహకారం కోసం రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి ఏ. గీతేష్ శర్మ ను ప్రత్యేకాధి కారి గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ పరిధి లోకి ఈ ప్రత్యేక పోస్ట్ రానుంది.

వివిధ దేశాల దౌత్య కార్యాలయాల తో సమన్వయం కోసం ప్రత్యేక అధికారి నియామకం చేసింది సర్కార్‌. అన్ని దేశాల దౌత్య కార్యాలయాలతో సమన్వయం, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ కి సహకారం, అంతర్జాతీయ తెలుగు సంఘాలకి సహకారం అందించనున్నారు గీతేష్ శర్మ. అలాగే… అంతర్జాతీయ సహకారం పై వివిధ ప్రభుత్వ శాఖల కు సలహాలు ఇవ్వనున్నారు గీతేష్ శర్మ. దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో విదేశీ వ్యవహారాల కోసం ప్రత్యేక పోస్టు క్రియేట్‌ చేయడంపై రాజకీయ విశ్లేషకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.