తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

-

దీపావళి పండగ రోజున వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాల దెబ్బకు.. పెట్రోల్‌ పై 5 రూపాయలు, డీజిల్‌ పై 10 రూపాయలు ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు మరింత ఉపశమనం కలిగించేలా.. వ్యాట్‌ను తగ్గించాలని రాష్ట్రాలకు సూచించింది.

దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ… పెట్రోల్‌ మరియు డీజిల్‌ ధరలు అమాంతం పడిపోయాయి. హైదరాబాద్‌ లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.6.29 తగ్గి… రూ. 108.20 కి చేరింది. అలాగే.. డీజిల్‌ ధర రూ. 94.61 కు చేరుకుంది. అలాగే విజయవాడ విషయానికి వస్తే…లీటర్‌ పెట్రోల్‌ పై ధర రూ.6.10 తగ్గి… లీటర్‌ పెట్రోల్‌ రూ. 104.23 కి చేరగా… డీజిల్‌ రూ. 94.15 చేరింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని.. వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news