ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత జిల్లాకు వెళుతున్నారు. తన సొంత ఊరికి వెళ్ళి అక్కడ పర్యటన చేయనున్నాడు. ఈ నెల 7,8 తేదీల్లో ఆయన కడప జిల్లాలో పర్యటించనున్నాడు. తన తండ్రి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొంటాడు. ఈమేరకు అక్కడి జిల్లా కలెక్టర్ హరికిరణ్ తో అక్కడి ఎస్పీ అన్బురాజన్‌తో ఆయన సమావేశం నిర్వహించారు. ఆయన కార్యక్రమానికి పర్యటన ఏర్పాట్లకు అన్నీ సిద్ధం చేయవాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించాడు.
మరోపక్క రాష్ట్రం లో కరోనా ఉన్న ఇలాంటి నేపద్యం లో ఎటువంటి ఆటంకం కలగకుండా స్టాండర్డ్ ఆపరేష్ ప్రోటోకాల్ ను తప్పనిసరిగా పాటించాలని అన్నీ జాగ్రత్తలు పాటించాలని ఆయన పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా ఆయన తన సొంత ఊరికి కూడా వెళ్లనున్నాడు, ఇడుపులపాయ, ఆర్కే వ్యాలికి ఆయన వెళ్లనున్నారు. ఆర్కే వ్యాలీ లోని ట్రిపుల్ ఐటీ లో నిర్వహించే కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. ఇక సీఎం పర్యటనలో భాగంగా జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని భారీ భద్రత ఏర్పాటు చేయాలాని జిల్లా ఎస్పీ అధికారులకు సూచించారు. సొంత ఊరికి జగన్ పర్యటన అని తెలియడంతో అక్కడి స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.